వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది!
- శ్రీలంక-భారత్ 'ఏ' జట్ల మ్యాచ్లో తీవ్ర వాగ్వాదం
- వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాడు హలంబగే గొడవ
- మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్
- ఆగ్రహంతో సూర్యవంశీ లంక ప్లేయర్పైకి దూసుకెళ్లిన వైనం
- ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటకు దారితీసిన ఘటన
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ 'ఏ', శ్రీలంక 'ఏ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీతో వాగ్వాదానికి దిగడం వివాదాస్పదంగా మారింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ను సూపర్ ఓవర్లో శ్రీలంక 'ఏ' జట్టు గెలుచుకుంది. అయితే, విజయం తర్వాత జరిగిన పరిణామాలు క్రీడాస్ఫూర్తికి మచ్చ తెచ్చేలా ఉన్నాయి.
ప్రముఖ క్రీడా వెబ్సైట్ 'క్రిక్బజ్' తన కథనంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక 'ఏ' ఆటగాడు విషెన్ హలంబగే, భారత యువ ఆటగాడు 15 ఏళ్ల సూర్యవంశీ వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. "ఇక మ్యాచ్ అయిపోయింది.. నువ్వు ఇంటికి వెళ్లు.." అంటూ హలంబగే అనడంతో సూర్యవంశీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కాస్తా శ్రుతిమించి ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి తోపులాటకు దారితీసింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అంపైర్లు, ఇతర అధికారులు, సీనియర్ ఆటగాళ్లు కల్పించుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఈ ఘటనపై శ్రీలంక 'ఏ' డ్రెస్సింగ్ రూమ్లో తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. మైదానంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ముఖ్యంగా తగినంత వెలుతురు లేకపోయినా సూపర్ ఓవర్ ఆడిన నేపథ్యంలో భారత జట్టుకు క్షమాపణ చెప్పాలని జట్టులోని కొందరు సభ్యులు సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా 'ఏ' జట్ల మధ్య జరిగే విషయాల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జోక్యం చేసుకోదు. కానీ, ఒక యువ ఆటగాడిపై ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఈ విధంగా ప్రవర్తించడం తీవ్రమైన అంశం కావడంతో ఐసీసీ జోక్యం చేసుకునే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.